Tips for breathing problem. మీ ముక్కు వాసన కోల్పోయిందా ?

By | August 13, 2020

ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్ యొక్క లక్షణాలలో ముక్కు వాసన పోవడం అనేది కూడా ఒక ప్రధాన లక్షణం . అయితే ఈ లక్షణం కనిపించిన వెంటనే అప్రమత్తం అవడం అవసరం. కొంతమందిలో జలుబు(Cold ) కొంచెం ఎక్కువ మోతాదులో అయినా కూడా ముక్కు కొంచెం వాసనను కోల్పోతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీకు ఈ లక్షణం కనిపిస్తే మనం తీసుకోవాల్సినే జాగ్రత్తలు ఏంటో తెలుసుకొందాం.

మీరు ముక్కు వాసన కోల్పోయిన వెంటనే పరీక్ష చేయించుకోవడం చాల అవసరం. అయితే మీరు పరీక్షకు మీ నమూనా ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో చిన్న పిల్లలకు మరియు వృద్దులకు దూరంగా ఉండడం తప్పనిసరి. ఎందుకంటే మీ నుంచి వైరస్ వారికి సంక్రమించే అవకాశం ఉంటుంది.

మీ యొక్క పరీక్ష ఫలితం వచ్చే వరకు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తరుచుగా ఆవిరి పట్టుకోవడం వాళ్ళ కాస్త ఉపశమనం లభిస్తుంది. మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. పండ్ల రసాలు , మంచి నీళ్లు బాగా తీసుకోవాలి.

మీకు ఇంకా ఏదైనా ఇంకా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. పరీక్షా ఫలితం ఏ విధముగా వచ్చిన సరే ముక్యంగా కంగారు పడవద్దు. డాక్టర్ సలహాలను తీసుకొని తగిన విధంగా చికిత్స తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *