Remedy for knee pain / మోకాళ్ళ నొప్పికి మంచి చిట్కా

By | August 16, 2020

ప్రస్తుత కాలంలో చాల మంది ప్రజలు మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు. వృద్ధ వయస్కులతోపాటు మధ్య వయస్కులకు కూడా మోకాలి నొప్పులు ఇబ్బందిపెడుతున్నాయ్. దీనికి గల కారణం సరియిన ఆహారం తీసుకోకపోవటం, తగు మోతాదులో కాల్షియమ్ మరియు విటమిన్ డ్ దేహానికి అందకపోవటం, అధిక బరువు, తక్కువగా నడవటం, కొన్ని శస్త్రచికిత్సలు జరగటం వలన, వృద్యాప్యం వలన, గాయాల వలన, ఎక్కువసేపు కూర్చోవటం మొదలగు కారణాల వలన మోకాళ్ళ నొప్పులు రావటానికి అవకాశాలు ఉన్నాయి.

చాల మంది ప్రజలు మోకాళ్ళ నొప్పులకు ఎక్కువగా వెంటనే ఉపశమనం పొందడానికి కొన్ని రకాల ఆయింట్మెంట్స్, లేపనాలు, పెయిన్ కిల్లర్స్ మొదలగు వాటిని వాడుతుంటారు. ఇవి వాడటం వలన తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది కానీ శాశ్వత పరిస్కారం దొరకదు. మనం కొన్ని రకాల పద్ధతులను అలవాటు చేసుకోవటం వలన కనీసం కొంతమేరకు మోకాళ్ళ నొప్పులను పారద్రోలవచ్చు.

మోకాళ్ళ నొప్పి బాగా వచ్చినపుడు మనం చల్లని మంచు ముక్కలతో లేదా బాగ చల్లని పదార్దాలతో మరియు వేడి పదార్దాలతో నొప్పి ఉన్న చోట కాపడం పెట్టాలి. మన పూర్వకాలంలో ఉప్పును బాగా వేడి చేసి ఒక బట్టలో వేసి మూట గట్టి నొప్పి ఉన్న చోట అద్దుతూ ఉండేవారు. కొంచెం నువ్వ్వుల నూనెకాని, ఆముదం నూనె కానీ తీసుకొని దాంట్లో కొన్ని వెల్లులిపాయలు వేసుకొని వేడిచేసి ఆ నూనెతో మర్దన చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది.

కాల్షియమ్ సంవృదిగా ఉన్న ఆహారాన్ని ఎక్కువ తీసుకోండి. ఎండలో కనీసం 10 నిమిషాలైనా నిలుచోండి. ఇలా చేయటం వలన విటమిన్ డ్ మన దేహానికి అందుతుంది. క్యారట్ జ్యూస్, పండ్లు, మంచి కూరగాయలను, పాలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, అల్లం ఎక్కువగా వాడుతుండాలి. తగినంత వ్యామయం చేయాలి లేదా వాకింగ్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *