IPL Rules in UAE. వామ్మో UAE లో ఆటగాళ్ల నియమాలు చూస్తే షాక్

By | August 14, 2020

ఈ ఏడాది వేసవికాలంలో ఇండియా లో జరగాల్సిన ఐపీల్ మ్యాచులు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. ఎట్టా కేలకు ఈ మ్యాచులను యూఏఈ (UAE ) లో జరపనున్నారు. అయితే ఈ మ్యాచులకు యూఏఈ కి వెళ్లాల్సిన ఆటగాళ్లకు మరియు వారి సహాయ సిబ్బందికి బీసీసీఐ కొన్నికఠిన నియమ నిబంధలు సూచించింది . ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం.

ఫ్రాంచైజ్ జట్లు ఆగష్టు 20 కంటే ముందుగా యూఏఈ కి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇక యూఏఈ కి వెళ్లే ముందు అన్ని ఫ్రాంచైజ్ జట్ల సభ్యులు గత 24 గంటల సమయంలో 2 సార్లు PCR టెస్ట్ చేయించుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత అందరు 6 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి ఇంకా ఈ 6 రోజుల క్వారంటైన్ సమయంలో 3 సార్లు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అన్ని టెస్టులు నెగటివ్ వచ్చిన తర్వాత వారు ట్రైనింగ్ మరియు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనవచ్చు. ప్రతి 5 రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకొవాలి .

టోర్నీ లో పాల్గొనే 8 ఫ్రాంచైజ్ లు వేరు వేరు హొటెల్స్లో ఉండాలని బీసీసీఐ వారికీ సూచనా ఇచ్చింది.

ఇక పోతే స్టేడియాన్ని 3 జోన్లుగా విభజిస్తారు. అందరు కూడా వారి వారి నిర్దిష్ట జోన్ లోనే ఉండాలి. ఆటగాళ్ల కు ఫీజియోథెరపి చేసే డాక్టర్ తప్పకుండ స్నానం చేసిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి .

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లకు ఒకే ప్రత్యేక ద్వారం ఉంటుంది. ప్రయాణ సమయంలో అందరు వారికీ ప్రతేకంగా కేటాయించిన విండో సీట్లో మాత్రమే కురావాలి. బస్సు ఎక్కేటప్పుడు అందరికి తప్పకుండ టెంపరేచర్ స్క్రీనింగ్ చేస్తారు.

ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే వెంటనే వారిని జట్టు సబ్యులకు దూరంగా ఉంచి ఐపీల్ మెడికల్ మేనేజర్ కు ఈ విషయం చెప్పాలి. తర్వాత చికిత్స నిమిత్తం అక్కడ దగ్గరలో వున్నా ఆసుపత్రిలో చేరాల్సివుంటుంది.

ఇక ఇవే నియమ నిబంధనలు ఫ్రాంచైజ్ ఓనర్లు మరియు ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *