How to remove warts in simple way at home / మొండి పులిపిర్లను కూడా ఇలా మాయం చేసే ఇంటి చిట్కా

By | August 19, 2020

ఈ ఆధునిక యుగంలో యువతతో పాటు మధ్య వయస్కులు కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. యువత తమ సంపాదనలో కొంచెం వారియొక్క బంగారు భవిష్యత్ పప్రణాళికలకు మరియు ఆర్థిక నిలకడకు పొదుపు చేస్తూనే కొంతమేరకు తమ సంపాదన అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపించడానికే ఖర్చుపెడుతున్నారు. ఎందుకంటే అందంగా ఉంటె ఆత్మ విశ్వాసం, ప్రత్యేకమైన గుర్తింపు మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతారు.

ఎంత అందంగా ఉన్న ఒక చిన్న పులిపిరి వస్తే మాత్రం అందం అంత పోయినట్టు అనిపిస్తుంది. ఇవి ఒకచోట మొదలై ఆలానే ఉంటాయి లేక మిగతా చోట్లకి కూడా వ్యాపిస్తుంటాయ్. అందుకే చాల మంది మొగ్గలోనే తుంచేయాలనుకుంటారు. మందులు ఎన్ని వాడిన తొందరగా తగ్గవు కానీ మనం పాటించే కొన్ని ఇంటి వైద్యం ద్వారా సులువుగా పులిపిర్లను తీసివేయొచ్చు. కొన్ని చిట్కాలు మనం ఇపుడు తీసుకుందాం.

కొంచెం తమలపాకులో వాడే సున్నం మరియు వంట సోడా రెండింటిని కొద్దిగా నీళ్లతో బాగా కలిపి పులిపిరి ఉన్నచోట మాత్రమే అద్దాలి, శరీరం మీద ఈ చోట అంటనివ్వకుండా చూసుకోవాలి. ఇది రాత్రి కాకుండా పాగాలులో కాలిగా ఉన్నపుడు 4-3 పెట్టుకుంటే పులిపిరి వెంటనే రాలిపోతుంది ఒకవేళ పోకుంటే రెండు మూడు రోజులు చేయండి.

ఉల్లిరసం కొబ్బరినూనె కలిపి కూడా పులిపిరి రాస్తే ఫలితం ఉంటుంది. వెల్లిరెబ్బను మెత్తని నూరి దాని పేస్ట్ పులిపిరి పెడితి కూడా మానుతుంది. రెడ్డివారి నానాబాలు మొక్క పాలను కూడా పులిపిరి పై రాస్తే అవి తాగుతాయ్. మందార ఆకుల పేస్ట్ రాయటం ఒక చిట్కా. సున్నం మరియు నిమ్మరసం కూడా కలిపి పురిపిరిపై రాయటం వాళ్ళ తగ్గుతుంది. తమలపాకు ఈనెలు మరియు సున్నం కలిపి రాస్తే వెంటనే ఊడిపోతాయ్. చిన్న పిల్లలకైతే తమలపాకు ఈనే తునించితే వచ్చే రసాన్ని పులిపిరిపై రాయాలి.

ఈ చిట్కాలు పాటించేటపుడు ఒక చిన్న మందపాటి పేపర్ ముక్క తీసుకొని దాన్ని పులిపిరి సైజు లో మధ్యలో కట్ చేసి, దాన్ని పులిపిరి పై పెట్టి అతికించాలి. తర్వాత పైన చెప్పిన మీరు వాడదలచిన మిశ్రమాన్ని చిన్న కర్రపుల్లతో కానీ, ఈయర్ బడ్ తోగాని పులిపిరి పైన అద్దాలి. ఇలా చేయటం వలన ఈ మిశ్రమం అనేది మిగతా భాగాలకు అంటుకోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *