Home remedy / సంతానానికి బామ్మ చిట్కా

By | August 18, 2020

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో యువత అందరు తమ ఉద్యోగ జీవితంలో బిజీ గా ఉండి సరియైన ఆహార నియమాలు పాటించక తమ శారీరక బలాన్ని కోల్పోతున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది సంతాన సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంతాన సమస్య నుంచి ఎలా బయట పడాలంటే బామ్మ ఈ వీడియో లో చక్కగా వివరించింది.

ప్రస్తుతం సాగుచేస్తున్న ఆహార పంటలు అన్ని కూడా సేంద్రియ ఎరువులతో కాకుండా అనేక రకాలైన రసాయనాలతో సాగు చేస్తున్నారు కాబట్టి వీటిని తిన్న ప్రజలు శారీరక సామర్ధ్యాన్ని కోల్పోతున్నారు. దీని వల్ల ముఖ్యంగా పురుషులలో వీర్య కణాల సంఖ్య తగ్గి సంతాన సమస్యలను ఎదురుకొంటున్నారు. కొన్ని సాధారణ ఆహార నియమాలను మార్చుకోవాలి.

ముఖ్యంగా స్త్రీ , పురుషులు ఇద్దరు కూడా మంచి బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. మగవారు అరటి పండును ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ప్రతి రోజు బాదాం గింజలను రాత్రి అంత నానబెట్టి పొద్దున్నే పరిగడుపున తీసుకోవాలి. ఎండు ఖర్జురా పండును తేనెలో నానబెట్టి తింటే కూడా మంచి ఫలితo ఉంటుంది.

ప్రతి రోజు శారీరక వ్యాయామం తో పాటు యోగాసనాలు చేయండం మంచిది . యోగాసనాలలో పద్మాసనం అనేది చాల మంచి ఆసనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *