Gold rates may be decrease / బంగారం ధరలు డిసెంబర్ నాటికీ తగ్గుతాయి

By | August 17, 2020

ఇటీవల వచ్చి ప్రపంచమంతా విస్తరించిన కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ విధించటం జరిగింది. లాక్ డౌన్ ప్రధాన ఉద్దేశం వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కానీ, ఇలా చేయడం వలన కొంతమేరకు వైరస్ వ్యాప్తిని అరికట్టిన, ప్రజల అవసరాల మేరకు మరియు ఆర్థిక సమస్యల మొదలుకాకుండా కొన్ని సడలింపులు చేసారు. ముందు వైరస్ వ్యాప్తి తగ్గిన సడలింపుల తర్వాత కరోనా వ్యాప్తి మెల్లి మెల్లిగా ఎక్కువైంది. లాక్ డౌన్ సమయంలో సరైన రవాణా వ్యవస్థ లేకపోవటం వలన నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు, రవాణా చార్జీలు అమాంతం పెరిగిపోయాయి. వీటితోపాటు ఆశ్చర్యకరంగా బంగారం ధర కూడా అమాంతం పెరిగి ఆకాశమంటుకుంది.

వైరస్ ప్రభావం మొదలు కాకముందు 10 గ్రాముల బంగారం దార 30,000 ఉంది. ఈ సంవత్సరం మార్చి తర్వాత బంగారం ధర వైరస్ ప్రభావం వలన క్రమక్రమంగా పెరుగుతూ 58,000 పై వరకు పెరిగింది. వైరస్ తీవ్రత వలన బంగారు నిల్వలు కలిగిఉన్న అగ్రరాజ్యాలైన అమెరికా, జర్మనీ, రష్యా, ఇటలీ,చైనా మొదలగు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరలకే బంగారాన్ని అమ్ముతారని బులియన్ నిపుణుల వివరించారు.

చాల మంది ప్రజలు ఇంకా బంగారం రేట్ పెరిగి 70,000 వరకు చేరుతుందని అపోహతో ముందుగానే బంగారం కొని పెట్టుకుంటున్నారు. ధనిక ప్రజలు బంగారం మీద ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసారు. బంగారం మీద ఎక్కువ పెట్టుబడులు మరియు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే బంగారం ధర కూడా తగ్గి 30,000 నుండి 40,000 పలకవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య నిపుణులు కూడా గ్రహాల కూటమి వలన బంగారం ధర పెరిగిందని దాని ప్రభావం తగ్గగానే బంగారం దార కూడా తగ్గుతుందని అంటున్నారు. 2020 సంవత్సరం చివరినాటికి అంటే డిసెంబర్ 2021 మార్చి లోపల బంగారం ధర క్రమంగా దిగి 25,000 రావచ్చని చెపుతున్నారు. ఇలా జరిగితే మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఆశాజనకం. అందుకే బంగారం ఇప్పుడు కొనద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *