Easy to removal of kidney stones by home tips/మూత్రపిండాల్లో రాళ్లు కరిగించే అద్బుతమైన చిట్కాలు

By | August 19, 2020

ఈ మధ్య కాలంలో చాల మంది ప్రజలు కిడ్నీ స్టోన్స్ (మూత్రపిండాల్లో రాళ్ళు) సమస్యతో బాధపడుతున్నారు. అసలు కిడ్నీల్లో రాళ్ళూ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం… మనం తినే ఆహారంను బట్టి కిడ్నీల్లో రాళ్ళూ ఏర్పడుతాయి. మాంసాహారం, మసాలా ఆహారం, నూనె వేయించినవి, కాల్షియమ్, యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉన్న పదార్దాలు తీసుకోవటం వలన స్టోన్స్ ఏర్పడుతాయి. ఇంకా మూత్రాన్ని ఆపుకునేవారికి, ఎక్కువగా కూర్చునే వారికీ, నీరు తక్కువ తాగేవారికి కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. స్టోన్స్ అనేవి చాల రకాలు ఉంటాయి. కాల్షియమ్ ఆక్సలేట్ స్టోన్స్, యూరిక్ ఆసిడ్ స్టోన్స్, స్తృ వైట్ స్టోన్, ఫాస్ఫాట్ స్టోన్ అనే రకాలు ఉంటాయి.

కాల్షియమ్, యూరిక్ ఆసిడ్ మరియు ఫాస్ఫేట్ స్టోన్స్ అనేవి మన దేహంలో వాటి యొక్క ఉన్న శాతం కంటే ఎక్కువైతే కిడ్నీస్ అనేవి వాటిని సర్రిగా వడపోయలేక అక్కడే ఉంది చిన్న చిన్న రాళ్ళలా ఏర్పడుతాయి. వీటిలో ఫాస్పేట్ స్టోన్స్ అనేవి పెద్ద పెద్ద సైజులో తయారువుతాయ్. స్తృ వైట్ స్టోన్స్ అనేవి మూత్రాశయం ఇన్ఫెక్షన్స్ వలన ఏర్పడుతాయి. కిడ్నీ స్టోన్స్ ఉంటె లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా వీపు భాగం నుండి పొట్ట వరకు తీవ్రమైన నొప్పి వస్తుంది. దేని వలన మూత్రంలో మంట, రక్తం వంటివి ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అవవుతాయి. కిడ్నీ స్టోన్స్ అనేవి 4-5 mm స్టోన్స్ ఉంటె అంతగా బయపడనవసరం లేదు. మనం కొన్ని చిట్కాల ద్వారా బయటికి పంపవచ్చు.

నీరు సాద్యమైనంత ఎక్కువ తాగాలి. మూత్రాన్ని ఎప్పుడు కూడా ఆపుకోవద్దు. కాల్షియమ్, ఫాస్ఫరస్, యూరిక్ ఆసిడ్ ఉన్న పదార్దాలు ఎక్కువ తీసుకోవద్దు. ఉలవలు మరియు ముల్లంగి శుభ్రంగా కడిగి నీటితో ఉడికించి, ఆ నీటిని దాహం వేసినప్పుడల్లా తగిలి లేదా చారుగాని చేసుకొని అన్నంతో పాటు తినాలి. ఈ చిట్కా ను మూడు రోజులొకసారి ప్రయత్నిచండి.

కొండ పిండి ఆకును చూర్ణంగానూ, కూరగాను, రసంగా మరియు రానపాలకు రసం రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. ఈ ఆకుల రసాలను వేరువేరుగా కొంచెం తేనె, నిమ్మరసం కలిపి ఉదయం, సాయంత్రం తాగండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *