మెట్రో ప్రయాణికులకు గమనిక : అన్ని చోట్ల ఆగదు

By | September 7, 2020

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు ప్రారంభం అవుతున్నాయి. సెప్టెంబర్ 7 సోమవారం నుండి హైదరాబాద్ మెట్రో రైలు కూత పెట్టనుంది . దశల వారీగా మెట్రో ప్రారంభం కానుంది .

మొదటగా ఎల్ .బి నగర్ నుండి మియాపూర్ వరకు మెట్రో సేవలు నడుస్తాయి. సెప్టెంబర్ 8 నుండి నాగోల్ నుండి రాయదుర్గం , సెప్టెంబర్ 9 నుండి ఎంజీబీస్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయి.

ఐపీల్ షెడ్యూల్ వచ్చేసింది . మొదటి మ్యాచ్ CSK Vs MI

ఈ మెట్రో ట్రైన్ టైం టేబుల్ లో కొన్ని మార్పులు చేసారు . ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మళ్ళీ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి .

ఇక పోతే కంటైన్మెంట్ జోన్లలో ట్రైన్ ఆగదు. దింతో మూసాపేట్ , భరత్ నగర్ , గాంధీ హాస్పిటల్ , యూసుఫ్ గూడ , ముషీరాబాద్ స్టేషన్లు మూసే ఉంచుతారు.

మెట్రో టికెట్ విధానం లో కూడా కొన్ని మార్పులు చేసారు. ఇంతకుముందు వున్న టోకెన్ పద్దతిని రద్దు చేసారు. ఒక్కసారి వాడింది మల్లి వాడకుండా పేపర్ రూపంలో టిక్కెట్లు విక్రయించనున్నారు.

మెట్రో రైలు ఎక్కే ప్రతి ఒక్కరిని టెంపరేచర్ ను చెక్ చేస్తారు. అన్ని స్టేషన్లలలో శానిటైజర్ లు అందుబాటులో ఉంచారు. ఇకపోతే సీటింగ్ విధానం లోను కొన్ని మార్పులు చేసారు. ఒక్కక్క సీటు వదిలి కూర్చోవాలి . ఇక నిలబడే ప్రయాణికులకు కూడా నిర్దిష్ట మైన మార్కు లు కేటాయిస్తారు . అందులో మాత్రమే నిలబడాలి .

లోన్ తీసుకున్న వారికీ సుప్రీంకోర్టు గుడ్ న్యూస్