ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయిల్ కు వ్యక్తులను ఎలా ఎంపిక చేస్తారు ? వారికీ వుండే రిస్క్ ఏంటి ?

By | September 1, 2020

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఎన్నో ఇబ్బందులు పడుతుంది. దీనికి కారణం ఈ వైరస్ కు సరైన చికిత్స లేకపోవడం. ప్రపంచం లో వున్న చాలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీ లు ఈ వైరస్ కు వాక్సిన్ ను కనుక్కోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి . అయితే ఏదైనా వాక్సిన్ మార్కెట్ లోకి విడుదల చేయాలంటే ముందుగా దానిని చాలా మంది మీద ట్రయిల్ వేయాల్సి ఉంటుంది . అయితే ఏదైనా వాక్సిన్ ట్రయిల్ వేయాలంటే ఎవరిని ఎలా ఎంచుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం .

మొత్తంగా 3 phase లో ట్రయిల్ వేయాల్సి ఉంటుంది . ముందుగా వ్యక్తులను ఎంచుకోవడం అనేది ముఖ్యమైన ప్రక్రియ . ఎంపికైన వ్యక్తులకు ముందుగా అన్ని రకాల మెడికల్ టెస్ట్ లతో పాటు వారి వయసు , జెండర్ , వారికీ ముందే వున్న ఆరోగ్య సమస్యలు అన్ని సేకరిస్తారు.

ఎంపికైన వాలంటీర్ ముందు గానే ఒక పేపర్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది . ట్రయిల్ లో వుండే రిస్క్ లు మరియు వారి బాధ్యతల గురించి అన్నిటికి సిద్ధంగా ఉండాలి.

ఎంపికైన వాలంటీర్ లకు ఈ ట్రయిల్ లో పాల్గొన్నందుకు ఎలాంటి నగదు చెల్లించరు . కేవలం వారు కంపెనీ కి ట్రయిల్ కు వచ్చి వెళ్లే టప్పుడు ప్రయాణం మరియు ఆహార ఖర్చులు ఇస్తారు. వారికీ కంపెనీ వారు ఒక ఇన్సూరెన్స్ చెల్లిస్తారు.

ఒక వాలంటీర్ ఏక కాలంలో ఒకే క్లినికల్ ట్రయిల్ లో పాల్గొనాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *