నిరూపిస్తే 100 గుంజీలు తీస్తా : మమతా బెనర్జీ

By | September 9, 2020

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం నాడు రాష్టం లో కొంత మంది అవాస్తమైన దుర్మార్గమైన ప్రచారాలు ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నారు అని వీడియో కాన్ఫరెన్స్ లో ఆరోపించారు. ఈ సారి ఏడాది దుర్గా పూజలు ఉండవని ప్రభుత్వం చెప్పిందని ఎవరైనా నిరూపిస్తే తాను 100 గుంజీలు తీస్తా అని అన్నారు.

దుర్గా పూజ గురించి ఒక రాజకీయ పార్టీ ఇలాంటి పుకార్లు చేస్తుందని ఆరోపించారు. ఇంకా మేము దాని గురించి ఎలాంటి సమావేశం కాలేదు అని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ దినోత్సవ కార్యక్రమం లో ఆమె ఈ విధంగా ఆరోపించారు.

సామజిక మాధ్యమాలలో ఇలాంటి నకిలీ పుకార్లు చేస్తున్న వారిని పోలీసులు కనుగొని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మత సామరస్యాన్ని చెడ గొట్టే ఇలాంటి పుకార్లను సహించేది లేదు అని అన్నారు. ఎప్పుడు పూజలు చేయనివారు కూడా పూజల గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *