క్రీడా పురస్కారాల ప్రైజ్ మనీ భారీగా పెంచిన ప్రభుత్వం

By | August 30, 2020

జాతీయ స్థాయిలో ఇచ్చే క్రీడా పురస్కారాలకు ఇచ్చే నగదు బహుమతి ని భారీగా పెంచారు. గతంలో ఖేల్ రత్న అవార్డు వచ్చిన ఆటాగాడికి 7.5 లక్షలు ఇచ్చేవారు ఇంకా అర్జున్ అవార్డు వచ్చిన ఆటాగాడికి 5 లక్షలు నగదు బహుమతి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పెంచిన నగదు బహుమతి ప్రకారం ఖేల్ రత్న అవార్డు కు 25 లక్షలు , అర్జున్ అవార్డు వచ్చిన 15 లక్షలు క్రీడా పురస్కారం కింద నగదు బహుమతి ఇవ్వనున్నారు.

క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ” క్రీడా పురస్కారాల నగదు బహుమతిని చివరి సారిగా 2008 లో నిర్ణయించారు. అయితే ప్రతి పది సవంత్సరాలకు ఒకసారి నగదు బహుమతి ఫై నిర్ణయం తీసుకోవాలి . మొత్తంగా 7 అవార్డు విభాగాలలో నగదు బహుమతి లో భారీగా పెరుగుదల ఉందని “ఆయన అన్నారు .

ద్రోణాచార్య అవార్డుకు అంతకు ముందు 5 లక్షలు ఇచ్చేవారు అయితే ఆ నగదు బహుమతిని ఇప్పుడు 15 లక్షలకు పెంచారు. ధ్యానుచందు అవార్డు వచ్చిన వారికీ అంతకు ముందు 5 లక్షలు ఇచ్చేవారు ఇప్పుడు పెంచిన నగదు బహుమతి 10 లక్షలుగా చేసారు.

ఈ సారి ఖేల్ రత్న అందుకున్న వారిలో 5 క్రీడాకారులు వున్నారు . అందులో క్రికెట్ నుండి రోహిత్ శర్మ , టేబుల్ టెన్నిస్ నుండి మణిక బాత్రా , ఉమెన్స్ హాకీ టీం నుండి రాణి రాంపాల్ , రెస్లింగ్ నుండి వినీష్ ఫోగట్ మరియు పారా ఒలంపిక్ నుండి బంగారు పతకం గెలిచిన మరియప్పను తంగవేలు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *