కోటి ప్రయోజనాల కొబ్బరి చెట్టు , తప్పక తెలుసుకోండి

By | September 6, 2020

ఈ ఆధునిక యుగంలో కొబ్బరి కాయల విక్రయం అనేది ఎంతో లాభదాయకమైన వ్యాపారంగా చెపుకోవచ్చు. ఏ వ్యాపారం అయినా కాలాలను బట్టి ఒకసారి లాభం రావొచ్చు లేదా అంతగా లాభం రాకపోవచ్చు. కానీ, కొబ్బరి తోటను సాగుచేసేవారికి ఎప్పుడు ఆశాజనకంగానే ఉంటుంది. అందుకే కొబ్బరిచెట్టుతో కోటి ప్రయోజనాలు అని అన్నారు పెద్దలు.

కొబ్బరి చెట్టులో ఏది పనికిరాని భాగం అంటూ లేదు. ఈ చెట్టును ఆధునిక యుగ కల్పతరువు అని పిలవవచ్చు. దేవునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించటం మన ఆనవాయితీగా వస్తుంది. కొబ్బరి నీళ్లను గుళ్ళల్లో తీర్థంగా పంచుతారు. అంత ప్రాధాన్యత ఇస్తారు కొబ్బరికి. ఏదైనా దిష్టి తీయడానికి కూడా కొబ్బరికాయను వాడతారు.

తక్షణ శక్తి కొరకు, ఉపవాసంలో, వాంతులు అవుతున్నవారికి, అత్యవసర పరిస్థితుల్లో, ప్రయాణాల్లో చేసినవారికి, అతిగా అలిసిపోయినవారికి, వడదెబ్బ తగిలినవారికి మరియు ప్రాణాపాయ స్థితులలో ఉన్నవారికి ఈ కొబ్బరి నీళ్లు అనేవి అమృతంలా పనిచేస్తాయి మరియు దేహానికి తక్షణ శక్తిని, బలాన్ని చేకూర్చుతాయ్.

కొబ్బరి నీళ్లు కాకుండా కొబ్బరి చెట్టులో ప్రతి భాగం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చెట్లు అనేవి నెల భాగంలో తక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి, అందుకే ఇంటికి ఒకటి లేదా రెండు చెట్లను పెంచుకుంటారు. కొబ్బరి చెట్టు యొక్క ముఖ్యమైన ఔషధ ప్రయోజనాలు ఇపుడు తెలుసుందాం.

కొబ్బరి ఆకులను మెత్తగా నూరి దానికి తగిన మోతాదులో సైన్ధవాః లవణం కలిపి మెత్తగా నూరి దాన్ని గడ్డలు, చీము ఉన్న చోట, గోరు చుట్టు, వృషణాల వాపు, గవధ బిళ్ళలు ఉన్న చోట కట్టు కడితే వాపు తగ్గుతుంది. గడ్డలు త్వరగా పక్యానికి వస్తాయి మరియు నొప్పి తగ్గుతుంది. లేత తెల్లటి కొబ్బరి ఆకులను ఉడికించి ఆ నీటిని కండరాల నొప్పి ఉన్న చోట రాస్తే ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి ఆకులను పెళ్లి పందిర్లలోను, పూజ మరియు పెళ్లి సంబంధిత అలంకరణలోనూ విరివిగా వాడుతున్నారు. కొబ్బరి ఆకుల ఈనేలను చీపురులుగా వాడుతున్నారు.

నేలమీద పడిన కొబ్బరి పువ్వులను సేకరించి వాటిని శుభ్రం చేసి, నేతిలో వేయించి, మెత్తగా దంచి పొడిచేసుకోవాలి. ఈ పొడిని తేనెతోగాని, పంచదారతోగాని లేదా నెరుగగాని ఆర చెంచా పొడిని మూడు పూటలా తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుంది. గర్భాశయ వ్యాదులని నివారిస్తుంది. రక్తపు వాంతులు మరియు విరేచనాలలో రక్తం పడటం ఆగిపోతుంది. లేత కొబ్బరిఆకుల పువ్వులను అంటుకొని ఉన్న మెత్తని దూది లాంటి పదార్థంను గాయాలపైన అంటిస్తే రక్తస్రావం ఆగి, గాయం త్వరగా మానుతుంది.కొబ్బరి పువ్వులను మరియు వేర్లను ఉడికించి తాగటం వలన మూత్రసంబంధిత వ్యాధులు తగ్గుతాయి.

లేత కొబ్బరి పాలను ఒక గ్లాసు తీసుకొని, దానిలో ఒక చెంచా మంచి గంధం కలిపి తాగటం వలన కామెర్లు తగ్గుతాయి మరియు వృద్దులకు తాగించటం వలన మూత్ర సంబంధిత బాధలు తగ్గి, మూత్రం సాఫీగా వస్తుంది.. ఈ మంచి గంధం కలిపిన లేత కొబ్బరి పాలను తీసుకోవటం వలన ఎక్కిళ్ళు తగ్గును, కడుపులో మంట, నొప్పి తగ్గును. మంచి వీర్య పుష్టి చేస్తుంది. తక్షణ శక్తి మరియు బలం చేకూరుతుంది.

స్వచ్ఛమైన కొబ్బరి నూనెని తలకు బాగా మర్దన చేయటం వలన వెంట్రుకల కుదుళ్లను గట్టిపరిచి, వెంట్రుకలు బలంగా, నల్లగా మరియు జుట్టు అనేది వత్తుగా ఎదిగేలా చేస్తుంది. అధిక వేడి ఉన్నవారు, తలపోటు ఉన్నవారు కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవటం వలన కళ్ళకు మరియు మెదడుకు చలవ చేస్తుంది. పచ్చి కొబ్బరి నుండి తీసిన నూనెను క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికీ మూడు పూటలా అరా చెంచా మోతాదులో ఇవ్వటం వలన ఆ రోగికి బలాన్ని మరియు దేహపుష్టిని చేకూరుస్తుంది.

స్వచ్ఛమైన కొబ్బరి నూనెను నోట్లో పోసుకొని కొద్దిసేపువరకు పుక్కిలిస్తే దంత రోగాలు, ఊపిరితిత్తుల రోగాలు నయమవుతాయి మరియు పైత్య రోగాలను హరింపచేస్తుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా సున్నం కలిపి కాలిన గాయాలపై పల్చగా పట్టు వేసి గంట తర్వాత తీసివేస్తే నొప్పి తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *