కరోనా : ఆడవారిపై చిన్న పిల్లలపై ప్రభావం ఎందుకు తక్కువ ?

By | August 29, 2020

కరోనా వైరస్ ఏ విధమైన ప్రాంతం తో మరియు వయసుతో సంబంధం లేకుండా అందరిని ప్రభావితం చేసింది. కానీ కరోనా వైరస్ భారిన పడ్డ వారిలో స్త్రీ లతో పోలిస్తే పురుషుల లోనే ఎక్కువ . చైనా , ఇటలీ , మరియు అమెరికా లో ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి లెక్కలు చూస్తే కొంచెం షాక్ కు గురికావాల్సిందే . ఆడవారి కంటే మగవారిలో మరణాల రేటు 20 శాతం ఎక్కువగా వుంది.

ఈ యొక్క అసమానతకు కల కారణాలను శాస్త్రవేత్త లు ఖచ్చితమైన కారణాలు చెప్పక పోయినప్పటికీ అనేక రకాలైన భిన్న మైన అభిప్రాయాలను వివరిస్తున్నారు . పురుషులు ఎందుకు ఈ వైరస్ కు ఎక్కువ గురువుతున్నారో ఖచ్చితమైన కారణం తెలుసుకుంటే మున్ముందు మంచి చికిత్స విధానాలను అనుసరించవచ్చు అని డాక్టర్ ఇవాసకి చెప్పారు.

ఈ వైరస్ ఆడవారి ఫై ప్రభావం చూపించకపోవడానికి మరొక కారణం కూడా చెప్తున్నారు. అదేంటి అంటే ఆడవారి లో వుండే X క్రోమోజోములు . ఈ X క్రోమోజోములు రోగ నిరోధక శక్తిని బల పరచడంలో బాగా పనిచేస్తాయి.ఇవి ఆడవారిలో రెండు ఉంటాయి కానీ మగవారిలో X , Y ఉంటాయి. దీనివల్ల మగవారు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. ఆడవారిలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ కారణంగా కరోనా వైరస్ ప్రభావం వీరిపై తక్కువుగా ఉంటుందని అమెరికాకి చెందిన వేక్ ఫారెస్ట్ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపారు.

అంతే కాకుండా మగవారి అలవాట్లు కూడా దీనికి కారణం కావచ్చు. ఇక 5 సంవత్సరాల లోపు చిన్న పిల్లల ఫై కూడా దీని ప్రభావం తక్కువగా వుంది. అందుకు వారి వాక్సిను లే కారణం అని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *