ఐపీల్ షెడ్యూల్ వచ్చేసింది . మొదటి మ్యాచ్ CSK Vs MI

By | September 6, 2020

ఇన్ని రోజులుగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఐపీల్ షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 19 నుంచి మ్యాచులు కొనసాగుతాయి. మన భారత కాలమాన ప్రకారం మొదటి రోజు మ్యాచ్ రాత్రి 7.30 లకు మొదలు అవుతుంది . మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK ) మరియు ముంబై ఇండియన్స్ (MI ) మధ్య జరుగుతుంది .

ప్రతి జట్టు ఒక టీం తో రెండు మ్యాచులు ఆడాల్సివుంది . రెండు మ్యాచులు జరిగిన రోజు మన భారత కాలమాన ప్రకారం మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 లకు మరియు రెండవ మ్యాచ్ 7.30 లకు ప్రారంభం అవుతాయి.

లీగ్ దశలో మొత్తం 56 మ్యాచులు జరుగుతాయి. అందులో 24 మ్యాచులు దుబాయిలో , 20 మ్యాచులు అబుదాబి లో, మరియు 12 మ్యాచులు షార్జాలో జరుగుతాయి. ప్లేఆఫ్ మ్యాచులు మరియు ఫైనల్ మ్యాచులకు ఇంకా తేదీలు నిర్ణయించలేదు.