ఊపిరితిత్తుల ను ఎలా శుభ్రం చేసుకోవాలి? How to clean the lungs…?

By | August 15, 2020

ఈ మధ్య కాలంలో వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది దానికి కారణం వాహనాల నుండి వెలువడే పొగ, కార్బన్ డై ఆక్సైడ్ మరియు కార్బన్ మోనిక్సిడ్, అడవులు నరికివేయడం, ఉన్న చెట్లను నరికివేసి వెంచర్స్ మరియు ఇళ్ల కోసం స్థలాలు ఏర్పాటుచేయడం, వాహనాల రద్దీ ఉండే చోట ఎక్కువ సమయం ప్రయాణం చేయడం, పొగ త్రాగటం వలన లేదా పొగ పీల్చటం మొదలగు కారణాల వలన చాలామంది ప్రజలు ఊపిరితిత్తుల సంబంధ వ్యాధుల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు.

ఊపిరితిత్తులు అనారోగ్యం పాలవకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇపుడు తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్యకరమైన ఆహారంను తీసుకోవాలి. రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. వీటిలో యాంటియోక్సిడెంట్స్ పుస్కలంగా ఉంటాయి. దీనివలన శ్వాస సంబంధ వ్యాధులు మరియు కాన్సర్ వచ్చే అవకాశాలు చాల తక్కువ. ఈ పనులతో పాటు అల్లం, వెల్లుల్లి, క్యారట్ జ్యూస్, నిమ్మ రసం మొదలనవి తీసుకోవాలి.

మంచి ఆహారంతోపాటు ట్రాఫిక్లో మాస్క్ ధరించటం లేదా ఏదైనా వస్త్రాన్ని కానీ ముక్కుకు కట్టుకోవాలి. పొగ త్రాగటం మరియు పొగ త్రాగేవారికి దూరంగా ఉండాలి. వీలైనంతవరకు వాయు కాలుష్యం ఉన్న చోట తిరగకుండా ఉండేట్లు చూసుకోవాలి. సీజనల్ ఫ్లూ మరియు జలుబు, దగ్గు ఉన్నవారికి కూడా కొంచెం దూరంగా ఉండాలి. శ్వాస సంబంధ యోగ చేయాలి. ఆరోగ్యకరమైన చెట్ల గాలిని పీల్చటం చాల మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *